గవర్నర్‌‌‌‌‌‌‌‌వి చీప్‌‌‌‌ పాలిటిక్స్‌‌‌‌..తమిళనాడు సీఎం స్టాలిన్‌‌‌‌ కామెంట్‌‌‌‌

గవర్నర్‌‌‌‌‌‌‌‌వి చీప్‌‌‌‌ పాలిటిక్స్‌‌‌‌..తమిళనాడు సీఎం స్టాలిన్‌‌‌‌ కామెంట్‌‌‌‌

చెన్నై: తమిళనాడు గవర్నర్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌ రవి చీప్‌‌‌‌ పాలిటిక్స్‌‌‌‌ చేస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం ఎం.కె. స్టాలిన్‌‌‌‌ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల కంటే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు.

 ‘‘మా ప్రభుత్వం(ద్రవిడ నమూనా ప్రభుత్వం) దేశానికే దిశానిర్దేశంగా ఉంది. కొంతమంది దుర్మార్గులు మాత్రం దీనిని సహించలేకపోతున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నరు” అని సీఎం స్టాలిన్‌‌‌‌.. గవర్నర్‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి కామెంట్‌‌‌‌ చేశారు. 

ఆదివారం ఆయన ధర్మపురిలో సంక్షేమ పథకాలు ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్‌‌‌‌‌‌‌‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు, విమర్శలపై తనకేమాత్రం ఆందోళన లేదని స్టాలిన్‌‌‌‌ చెప్పారు. 

కానీ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్‌‌‌‌‌‌‌‌ రవి మాత్రం ఆ ప్రతిపక్షాల కంటే చీప్‌‌‌‌ పాలిటిక్స్‌‌‌‌ చేస్తున్నారని అన్నారు. రాజ్‌‌‌‌భవన్‌‌‌‌లో కూర్చుని తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.