
కరోనా బారిన పడిన వారిని రక్షించేందుకు అహర్నిశలు శ్రమిస్తూ...ఆ వైరస్ కు బలైన 43 మంది డాక్టర్ల కుటుంబాలకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ. 25 లక్షల రూపాయలను అందిస్తున్నట్లు బుధవారం తెలిపారు. అంతేకాదు.. ఫ్రంట్ లైన్ కార్మికులకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు గానూ ప్రోత్సహాకాలు ప్రకటించారు. అధికారిక ప్రకటన ప్రకారం ఏప్రిల్,మే, జూన్ నెలలకు గానూ డాక్టర్లకు రూ. 30 వేలు, నర్సులకు రూ. 20 వేలు, ఇతర కార్మికులకు రూ. 15 వేలు, అంతేకాకుండా పీజీ విద్యార్థులు, ట్రైనీ డాక్టర్లకు రూ. 20 వేలను ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్ల తెలిపారు సీఎం స్టాలిన్.