పురుగుమందు తాగిన తమిళనాడు ఎంపీ గణేశమూర్తి

పురుగుమందు తాగిన తమిళనాడు ఎంపీ గణేశమూర్తి

ఈరోడ్ :  తమిళనాడులోని ఈరోడ్ నియోజకవర్గానికి చెందిన సిట్టింగ్ లోక్‌‌సభ ఎంపీ ఎ.గణేశమూర్తి పురుగుల మందు తాగారు. సోమవారం ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. అనంతరం తాను పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వారు వెంటనే అతన్ని దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షల అనంతరం ఐసీయూలో వెంటిలేటర్‌‌పై ఉంచారు. ఆ తర్వాత మెరుగైన ట్రీట్​మెంట్ ​కోసం మధ్యాహ్నం 2.30 గంటలకు అక్కడి నుంచి అంబులెన్స్‌‌లో కోయంబత్తూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న ఎండీఎంకే నేత దురై వైకో ఆస్పత్రికి చేరుకున్నారు. గణేశమూర్తి హెల్త్​ కండీషన్​ విషమంగా ఉందని, ఎక్మో చికిత్సలో అందిస్తున్నారని చెప్పారు. అలాగే, రాష్ట్ర అర్బన్ డెవలప్‌‌మెంట్, హౌసింగ్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి ఎస్.ముత్తుసామి, మోదకురిచ్చి బీజేపీ ఎమ్మెల్యే సి.సరస్వతి, అన్నాడీఎంకేకు చెందిన కేవీ రామలింగం తదితర ఇతర రాజకీయ నాయకులు కూడా ఆస్పత్రికి వచ్చి గణేశమూర్తి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన ఆత్మహత్యాయత్నాయానికి గల కారణాలు తెలియరాలేదు. 2019 లోక్‌‌సభ ఎన్నికల్లో డీఎంకే టికెట్‌‌పై ఎంపీగా  గెలిచారు.