తమిళనాడులో భారీ వర్షాలు..స్కూళ్లకు హాలిడే

తమిళనాడులో భారీ వర్షాలు..స్కూళ్లకు హాలిడే

తమిళనాడులోని పలు జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. చెన్నై మధురై, నాగపట్నం, ట్యూటికోరిన్ లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అటు కుండపోతవానలకు రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలను వర్షం నీరు ముంచెత్తడంతో..స్థానికులు ఇళ్లను బయటకురాలేని పరిస్థితి నెలకుంది. ముంపుప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులుతెలిపారు. భారీ వర్షాలకు మదురై జిల్లాలో స్కూళ్లకు హాలిడే ప్రకటించారు అధికారులు. భారీ వర్ష సూచనతో చెన్నైలోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.  

గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌లోని 15 జోన్లతో పాటు ఇతర జిల్లాల్లో పరిస్థితిని పర్యవేక్షించడానికి స్టాలిన్ ప్రభుత్వం మానిటరింగ్ అధికారులను నియమించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్​ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.  

భారత వాతావరణ శాఖ (IMD) తమిళనాడుకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది, ప్రభుత్వ అధికారులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకారం నవంబర్ 7 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది.