1 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్.. నో నైట్ కర్ఫ్యూ

1 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్.. నో నైట్ కర్ఫ్యూ

కరోనా ఆంక్షల విషయంలో తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఒమిక్రాన్ వ్యాప్తి భయం, కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు మూసివేతతో పాటు నైట్ కర్ఫ్యూ విధించింది తమిళనాడు సర్కారు. అయితే ప్రస్తుతం కేసులు కొంత మేర తగ్గుముఖం పట్టడం, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగా ఉండడం, మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో ఆంక్షలను సడలించాలని నిర్ణయించింది. స్కూళ్లు, కాలేజీలను ఫిబ్రవరి 1 నుంచి తెరవాలని నిర్ణయించినట్లు స్టాలిన్ సర్కారు ప్రకటించింది. కొవిడ్ జాగ్రత్తలను పక్కాగా పాటిస్తూ ఫిజికల్ క్లాసులను నిర్వహించాలని తమిళనాడు విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

సండే లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

కరోనా కేసుల్లో రోజు కొంత మేర కనిపిస్తుండడంతో ఆంక్షలను కూడా సడలించాలని తమిళనాడు సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలు చేస్తున్న సండే లాక్‌డౌన్‌ను నిలిపేయాలని, అలాగే ప్రతి రోజూ అమలులో ఉన్న నైట్‌ కర్ఫ్యూను కూడా ఎత్తేయాలని నిర్ణయించింది. రేపటి నుంచి నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు స్కూళ్లు, కాలేజీలను తెలంగాణ కూడా ఫిబ్రవరి ఒకటి తర్వాత తెరిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తల కోసం..

11సార్లు గెలిచిన కాంగ్రెస్ నేతపై బీజేపీ నుంచి కోడలి పోటీ

ఆ రెండు కరోనా వ్యాక్సిన్లకు నార్మల్ డ్రగ్ పర్మిషన్

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు