
తమిళనాడు లోని చెన్నైలో దారుణం జరిగింది. ప్రేమించలేదన్న కారణంతో యువతిని రైలు కిందకు తోసేసి హత్య చేశాడో వ్యక్తి. ఆదంబాక్కానికి చెందిన మాణిక్యం కూతురు సత్య..టీనగర్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. స్థానికంగా ఉంటున్న సతీశ్ అనే వ్యక్తి..కొంత కాలంగా ప్రేమ పేరుతో వెంటపడుతున్నారు. అందుకు అమ్మాయి అంగీకరించలేదు.
గురువారం కాలేజీకి వెళ్లేందుకు సత్య..సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ లో ఫ్లాట్ ఫామ్ పై వెయిట్ చేస్తుంది. అక్కడకు వచ్చిన సతీశ్..ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో తాంబరం నుంచి వస్తున్న రైలు కిందకు తోసేశాడు. దీంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..నిందితుడిని అరెస్ట్ చేశారు.