టీకాలు తీసుకోని వ్యక్తులకు హోటల్స్‌, మాల్స్‌లో నో ఎంట్రీ

టీకాలు తీసుకోని వ్యక్తులకు హోటల్స్‌, మాల్స్‌లో నో ఎంట్రీ

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వణికిస్తోంది.  ఈ క్రమంలో  తమిళనాడు ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా.. షాపింగ్‌ మాల్స్‌, కాంప్లెక్స్‌లో, బహిరంగ ప్రదేశాల్లో వ్యాక్సిన్‌ తీసుకోనివారు ప్రవేశించడానికి అనుమతి లేదని తమిళనాడులోని మధురై జిల్లా యంత్రాంగం ప్రకటించింది. కొత్తగా విధించిన ఆంక్షలు వచ్చే వారం నుంచి అమలుకానున్నాయి. ఆంక్షలు అమల్లోకి రాకముందే ప్రజలందరూ కనీసం ఒక్కడోస్‌ అయినా వ్యాక్సిన్‌ తీసుకోవాలని.. టీకా వేయించుకోవడానికి ఒక వారం సమయం ఇస్తున్నట్లు ఆ జిల్లా యంత్రాంగం తెలిపింది.