Parking Movie In Oscar Library: పార్కింగ్ మూవీకి అరుదైన గౌరవం.. ఆస్కార్ లైబ్రరీలో చోటు

Parking Movie In Oscar Library: పార్కింగ్ మూవీకి అరుదైన గౌరవం.. ఆస్కార్ లైబ్రరీలో చోటు

తమిళ సూపర్ హిట్ పార్కింగ్(Parking) సినిమాకు ఇంటర్నేషనల్ లెవల్లో అరుదైన గౌరవం దక్కింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఏకంగా ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కించుకుంది. ఇదే విషయాన్ని ఆస్కార్‌ మేనేజింగ్‌ లైబ్రేరియన్‌ ఫిలిఫ్‌ గార్సియా అధికారికంగా ప్రకటించిందట. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆస్కార్ టీమ్ ఈ మెయిల్ చేశారని పార్కింగ్ చిత్ర నిర్మాత కేఎస్‌ సినీష్‌ సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ తో పంచుకున్నారు. దీంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక పార్కింగ్ సినిమా విషయానికి వస్తే.. ఒకే ఇంట్లో అద్దెకు ఉంటున్న ఇద్దరు టెనెంట్స్ మధ్య పార్కింగ్ విషయంలో చిన్న గొడవ మొదలవుతుంది. ఇద్దరి ఈగోల కారణంగా ఆ గొడవని ప్రాణాలు తీసుకునే స్థాయికి తీసుకెళ్తారు. చివరికి తమ తప్పులు తెలుసుకొని మారిపోతారు. ఈ సినిమాలో హరీష్‌ కల్యాణ్, ఎమ్‌ఎస్‌ భాస్కర్, ఇందుజా రవిచంద్రన్‌ ప్రధాన పాత్రల్లో నటించగా.. దర్శకుడు  రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ను అధ్బుతంగా తెరకెక్కించారు.

కేవలం రూ. 3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.15 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2023 డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమాకు ఓటీటీ విడుదల తరువాత అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన అన్ని భాషాల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. మరి ఇప్పటివరకు ఎవరైనా ఈ సినిమా చుడనివారు ఉంటే వెంటనే చూసేయండి.