హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తమిళ్ తలైవాస్ ఐదో విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తలైవాస్ 45–28తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. రైడర్ నరేందర్ (14), అజింక్యా పవార్ (11), సాగర్ (5), సాహిల్ (4) తమిళ్ జట్టుకు పాయింట్లు అందించారు. బెంగళూరు లెఫ్ట్ రైడర్ అక్షిత్ 14 పాయింట్లు సాధించినా ప్రయోజనం లేకపోయింది. భరత్‌తో సహా అందరూ ఫెయిలయ్యారు. మరో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్ 34–24తో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. పుణెరి తరఫున చియాన్ (9), మోహిత్ (7), అస్లామ్ (5) రాణించారు. గుజరాత్ టీమ్‌లో మహ్మద్ నబీబక్ష్ (7), ప్రతీక్ దహియా (5) మాత్రమే బాగా ఆడారు.
