యూట్యూబర్‌కు ఆరోగ్య శాఖ నోటీసులు: వీడియో తీసేయాలని ఆదేశం

యూట్యూబర్‌కు ఆరోగ్య శాఖ నోటీసులు: వీడియో తీసేయాలని ఆదేశం

తమిళ్ యూట్యూబర్ ఇర్ఫాన్ వివాదంలో చిక్కుకున్నాడు. తనకు పుట్టబోయే బిడ్డ జండర్ ను తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. దీన్ని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ సీరియస్ గా తీసుకుంది. కొన్ని రోజుల క్రితం తన భ్యార్యతోపాటు దుబాయ్ టూర్ వెళ్లిన  ఇర్ఫాన్ అక్కడ ఆమెకు లింగనిర్థారణ పరీక్ష చేయించాయి. మే 19న ఫ్యామిలీ ఫంక్షన్ రోజు తనకు పుట్టబోయేది అమ్మాయి అని ప్రకటించాడు. దానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

ఇండియాలో లింగనిర్థారణ పరీక్షలు ఇల్లీగల్ కాబట్టి ఆరోగ్య శాఖ యూట్యూబర్ ఇర్ఫాన్‌కు ఆ వీడియో డిలీట్ చేయాలని ఆదేశిస్తూ నోటీసులు పంపింది. సైబర్ క్రైం డిపార్ట్ మెంట్ కు వెంటనే ఆ వీడియో ఇంటర్నెట్ నుంచి తీసేయాలని లెటర్ రాసింది.  ప్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్(PCPNDT) యాక్ట్ 1994 ప్రకారం పుట్టబోయే పిల్లలు అమ్మాయా, అబ్బాయా అని స్కానింగ్ చేయించొద్దు. ఇలా చేస్తే నేరం.. దానికి శిక్ష కూడా పడుతుంది.