వాట్ యాన్ ఐడియా సర్ జీ : బయట తిరిగితే ఇలా పాడె మోస్తారేమో

వాట్ యాన్ ఐడియా సర్ జీ : బయట తిరిగితే ఇలా పాడె మోస్తారేమో

కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు టెక్నాలజీని జోడిస్తున్నారు. వైరస్ నుంచి సురక్షితంగా ఉండాలంటే ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రావొద్దని కోరుతున్నారు. అయినా కొంతమంది శనగ పిండి కోసం వచ్చాం, అత్తగారింటికి వెళుతున్నాం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్లకు చెక్ పెట్టేందుకు తమిళనాడు పోలీసులు కొత్త ఫంథాను అనుసరిస్తున్నారు.

మొన్నటికి మొన్న తమిళనాడుకు చెందిన పోలీసులు  ప్రధాన కూడళ్ల ల్లో అంబులెన్స్ లు ఏర్పాటు చేసి… రోడ్ల మీద తిరుగుతున్న పబ్లిక్ ను క్వారంటైన్ కు తరలిస్తున్నారు.  అయితే అంబులెన్స్ ఎక్కేందుకు పలువురు వాహనదారులు భయపడుతున్నారు. అంబులెన్స్  లోపల కరోనా పేషెంట్ కు సూట్ ధరించిన విధంగా  ఓ వ్యక్తికి సూట్ తగిలించి పడుకోబెట్టారు . ఆ వ్యక్తిని చూసి  అంబులెన్స్ ఎక్కడానికి భయపడి పారిపోయారు. ఆ దెబ్బతో స్థానికులు రోడ్డు మీద తిరగాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తాజాగా తమ క్రియేటివిటీతో కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు తమిళనాడు పోలీసులు. ఎలా అంటారా..? ఘనా దేశంలో పల్బెరియాస్ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం ఆ సాంప్రదాయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పాడెను మోస్తూ ఓ నలుగురు యువకులు డ్యాన్స్ చేస్తుంటారు. ఆ డ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడదే డ్యాన్స్ ను తమిళనాడు పోలీసులు  కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు ఉపయోగించుకుంటున్నారు.

బైక్ పై రోడ్ మీద తిరుగుతున్న యువకుడు ఓ ప్రాంతంలో వాహనదారుల్ని ఆపి అంబులెన్స్ ఎక్కిస్తున్న పోలీసులు ప్రత్యక్షమవుతారు. అదే పోలీసులు తన బైక్ ను ఆపేసి పాడెమీద పడుకోబెట్టి పల్బెరియాస్ డ్యాన్స్ చేస్తూ అంబులెన్స్ ఎక్కిస్తున్నట్లు ఊహించుకుంటాడు. దీంతో కంగుతిన్న యువకుడు వెనక్కితిరిగి ఇంటికి వెళ్లిపోతాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.