
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష బీభత్సానికి సేలంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఊటీలో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల రహదారులన్నీ జలమయం అయ్యాయి. ప్రస్తుతం చెన్నైసహా 7 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ప్రకటించింది.దక్షిణ తమిళనాడుకు రెయిన్ అలర్ట్ 48 గంటల పాటు ( మే 23,24) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణ శాఖ వెల్లడిం చింది..
తమిళనాడులో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. రాగల 48 గంటలు ( మే 23,24) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ నేపథ్యంలో చెన్నైతో పాటు మరో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red Alert) ను జారీ చేసింది. ఇప్పటికే వర్షం ప్రభావానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపోయాయి. రోడ్లన్ని జలమయం అయ్యాయి. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదిలాఉండగా.. నైరుతి బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. 48 గంటల్లో ఇది వాయుగుండగా మారుతుందని చెప్పింది. అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ బలపడనుందని తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురస్తాయని స్పష్టం చేసింది.