4 పోలీస్ టీంలు.. 2 తెలుగు రాష్ట్రాల్లో తనిఖీలు

4 పోలీస్ టీంలు.. 2 తెలుగు రాష్ట్రాల్లో తనిఖీలు
  • విజయవాడ, రాజమండ్రిల్లో పట్టుకున్నట్టు సమాచారం
  • ఆయుధాలు, బట్టలు స్వాధీనం ? 
  • సీక్రెట్​గా విచారణ.. అలాంటిదేమీ లేదంటున్న పోలీసులు  

ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు ఆంధ్రప్రదేశ్ లో అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతున్నా పోలీసులు ధ్రువీకరించడం లేదు. హత్య జరిగిన తర్వాత సీపీ విష్ణు వారియర్​ నేతృత్వంలో నాలుగు టీంలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వెతకడం మొదలుపెట్టాయి. ఏసీపీ శబరీశ్ ​నాయకత్వంలో  ఒక టీం ఏపీలో గాలిస్తుండగా నిందితులు చిక్కినట్టు సమాచారం. ఏ1 తమ్మినేని కోటేశ్వరరావు, ఏ3  జక్కంపూడి కృష్ణ మినహా.. ఏ2 రంజాన్, ఏ4 గంజి స్వామి, ఏ5 నూకల లింగయ్య, ఏ6 బోడపట్ల శ్రీను, ఏ7 నాగేశ్వరరావు, ఏ8 ఎల్లంపల్లి నాగయ్యలను విజయవాడ, రాజమండ్రిల్లో పట్టుకున్నట్టు తెలుస్తోంది.

హత్య చేసినప్పుడు ఉపయోగించిన ఆయుధాలు, బట్టలు అక్కడే స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే వీరిని సీక్రెట్​ప్లేస్​లో ఇంటరాగేషన్​ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతుండగా, పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. ఒకవేళ అరెస్ట్ ​చేసినట్టు చూపిస్తే 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది కాబట్టి బయటకు పొక్కనీయడం లేదంటున్నారు. కాగా, కృష్ణయ్య హత్య కేసులో మండలంలోని ఓ టీఆర్ఎస్​లీడర్ కు సంబంధం ఉందేమో అన్న అనుమానంతో పోలీసులు గురువారం ఆయన ఇంట్లో సోదాలు చేశారు. పోలీసులు మాత్రం తనిఖీల విషయాన్ని కొట్టిపారేస్తున్నారు.