
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. కాసేపటి క్రితం ఏఐజీ వైద్యులుహెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తమ్మినేని వెంటిలెటర్ సపోర్ట్‌తో ఖమ్మం నుంచి ఏఐజీకి వచ్చారని చెప్పారు. తమ్మినేనికి ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నామన్నారు వైద్యులు. ఊపిరితిత్తుల నుంచి నీరును తొలిగిసంచడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆయనకు వివిధ విభాగాల నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు.
ఈరోజు ఖమ్మం రూరల్ మండలం తెల్దార్ పల్లిలోని నివాసంలో తమ్మినేని వీరభద్రం గుండెపోటుతో అస్వస్థతకు గురికావడంతో ఆయనను హుటాహుటినా కుటుంబం సభ్యులు చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు . ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వీరభద్రాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు..