- శృంగవరపు ప్యానెల్ క్లీన్ స్వీప్
- కార్యవర్గ పదవులు అన్నింటినీ కైవసం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించిన శృంగవరపు ప్యానెల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలను తలపించే రీతిలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ఘన విజయం సాధించారు.ఆయనతోపాటు ఆయన ప్యానెల్ మొత్తం విజయం సాధించింది.భారత కాలమానం ప్రకారం కొద్దిసేపటి క్రితం ఓట్ల లెక్కింపు పూర్తయింది. నిరంజన్‌కు తానా ప్రస్తుత అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, అంజయ్య చౌదరిలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో నిరంజన్ శృంగవరపు ప్యానెల్ ఘన విజయం సాధించారు. దీంతో తానా తదుపరి అధ్యక్షుడిగా నిరంజన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో నిరంజన్ ప్యానెల్ కార్యవర్గ పదవులు అన్నింటినీ కైవసం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. తానా ప్రస్తుత అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, అంజయ్య చౌదరిల ద్వారా నిరంజన్ కు 1758 ఓట్లు పడినట్లు సమాచారం. అధ్యక్ష పదవికి పోటీ పడిన నరేన్ కొడాలికి తానా మాజీ అధ్యక్షుడు
జయరామ్ కోమటి, సతీష్ వేమన మద్దతు ప్రకటించారు.
తానా సంస్థలో కీలకమైన పదవుల కోసం జరిగిన ఎన్నికల్లో గెలిచేందుకు పోటీ చేసిన అభ్యర్థులు హోరా హోరీగా ప్రచారం చేశారు. అమెరికాలోని తెలుగువారిని అందరినీ కలుస్తూతమను గెలిపించాలని కోరుతూ భారత్ లో ఎన్నికలను తలపించేలా ప్రచారం చేసుకున్నారు.ఈ నేపధ్యంలో ఓట్ల లెక్కింపు కూడా ఉత్కంఠ రేపింది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న
తెలుగువారందరూ ఆసక్తిగా గమనించేలా చేసిన ‘తానా’ ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. అధ్యక్షుడిగా పోటీ చేసిన నిరంజన్‌కు 10,866ఓట్లు పోలవగా నరేన్ కొడాలికి 9,108 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఆధిక్యం కనబరిచిన నిరంజన్ ప్యానెలే చివరికి భారీ మెజారిటీతో గెలుపొందింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
పోటీ చేసిన అభ్యర్థులు అభ్యర్థులకు పోలైన ఓట్లు
విజయ్ గుడిసేవ 9,193
కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ 11,116
జనార్ధన్ నిమ్మలపూడి 10,971
పోట్లూరి రవి 9,676
మొత్తం: 40,956
భరత్ మద్దినేని 11,058
సునీల్ పంత్రా 9,621
మొత్తం: 20,679
శ్రీనివాస్ గోనినేని 741
కొడాలి నరేన్ 9,108
నిరంజన్ శృంగవరపు 10,866
మొత్తం: 20,715
అశోక్ బాబు కొల్లా 11,465
జగదీష్ ప్రభాల.కే 9,168
మొత్తం: 20,633
వెంకట్ కొగంటి 9,377
మురళి తాళ్లూరి 11,27
మొత్తం: 20,654
అనిల్ చౌదరి ఉప్పలపాటి 9,259
శశాంక్ యార్లగడ్డ 11,420
మొత్తం: 20,679
రాజనీకాంత్ కాకర్ల 9,571
రాజా కాసుకుర్తి 11,420
మొత్తం: 20,665
చాందిని దువ్వురి 9,558
కటికి ఉమ 11,158
మొత్తం: 20,711
రీజినల్ కో-ఆర్డినేటర్ న్యూజెర్సీ (ఓట్ ఫర్ 1)
అద్దంకి శ్రీ పద్మలక్ష్మీ 371
వాసిరెడ్డి వంశీకృష్ణ 706
మొత్తం: 1,077
ఫౌండేషన్ డోనార్ ట్రస్టీ (ఓట్ ఫర్ 2)
అమిర్నేని కిరణ్ 48
విద్యాధర్ గారపాటి 54
ప్రసాదరావు నల్లూరి 49
శశికాంత్ వల్లపల్లి 64
మొత్తం: 215
రీజినల్ కోఆర్డినేటర్-DFW (ఓట్ ఫర్ 1)
సతీష్ కొమ్మన 1,280
దినేష్ త్రిపురనేని 695
మొత్తం:1,975
రీజినల్ కో-ఆర్డినేటర్ మిడ్వెస్ట్ (ఓట్ ఫర్ 1)
హనుమంతరావు చెరుకూరి 446
కొమ్మలపాటి శ్రీధర కుమార్ 373
మొత్తం: 819
రీజినల్ కో-ఆర్డినేటర్ నార్త్ సెంట్రల్ (ఓట్ ఫర్ 1)
సాయి బొల్లినేని 240
యార్లగడ్డ శ్రీమన్నారయణ 130
మొత్తం: 370
రీజినల్ కో-ఆర్డినేటర్ మిడ్ అట్లాంటిక్ (ఓట్ ఫర్ 1)
శశిధర్ జాస్తి 291
సునీల్ కుమార్ కోగంటి 535
మొత్తం: 826
రీజినల్ కో-ఆర్డినేటర్ న్యూ ఇంగ్లండ్ (ఓట్ ఫర్: 1)
ప్రదీప్ కుమార్ గడ్డం 1,052
యలమంచిలి రావు 369
మొత్తం: 1,421