రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా టంకశాల అశోక్‌

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా టంకశాల అశోక్‌

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ జర్నలిస్టు, రచయిత, సాహిత్యకారుడు టంకశాల అశోక్‌ నియమితులయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. అంతర్ రాష్ట్ర సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా తనను నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రాష్ట్రాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తానని చెప్పారు.