
హైదరాబాద్ తప్పచెబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని దైబాగ్లో జూన్ 20 మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు ట్రాన్సజెండర్లు హత్యక గురవడం కలకం రేగింది. గుర్తు తెలియని దుండగులు ఇద్దర ట్రాన్స్ జెండర్లను బండరాళ్లు కొట్టి, కత్తితో అతి కిరాతకంగా పొడిచి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం పరిశీలించారు.
యూసుఫ్ అలియాస్ డాలి(25), రియాజ్ అలియాస్ సోఫియా (30) అనే ఇద్దరు హిజ్రాలను గుర్తు తెలియని వ్యక్తులు జూన్ 20వ తేదీ మంగళవారం అర్ధరాత్రి కత్తులతో పొడిచి.. బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లు డీసీపీ కిరణ్ ఖరే తెలిపారు. వీరిద్దరూ తప్పచెబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తారని చెప్పారు. సంఘటన స్థలంలో కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ జంట హత్యలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.