సెంట్రల్ జైల్లోనే ఫోన్ల దుకాణం.. ఉగ్రవాదులకు అమ్ముతూ రూ.కోటి సంపాదించిన సైకాలజిస్ట్ !

సెంట్రల్ జైల్లోనే ఫోన్ల దుకాణం.. ఉగ్రవాదులకు అమ్ముతూ రూ.కోటి సంపాదించిన సైకాలజిస్ట్ !

సెంట్లర్ జైళ్లలో ఉన్న ఉగ్రవాదులు.. తమ ఎజెండాను ప్రచారం చేసేందుకు అధికారులను ఎలా వాడుకుంటారో ఈ స్టోరీ ప్రత్యక్ష సాక్ష్యం. డబ్బుకోసం కకృతి పడి దేశాన్ని తాకట్టుపెట్టే కొందరు.. టెర్రరిస్టులకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తూ దేశానికి తీరని నష్టాన్ని చేకూరుస్తున్నారు. అందులో ఖైదీలకు మానసిక వైద్యం చేయాల్సిన ఓ సైకాలజిస్టు.. ఉగ్రవాదులకు ఫోన్లు అమ్ముతున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఫోన్లు స్మగ్లింగ్ చేసి టెర్రరిస్టులకు అమ్ముతూ ఏకంగా కోటి రూపాయలు సంపాదించాడనే నిజం తెలిసి అధికారులను షాక్ కు గురిచేసింది.

సైకాలజిస్టు సెంట్రల్ జైల్లోనే ఫోన్ల వ్యాపారానికి దిగిన ఘటన బెంగళూర్ జైళ్లో చోటుచేసుకుంది. ఖైదీలను రాడికలైజేషన్ చేసి ఉగ్రవాదం వైపు ఆకర్శితులను చేసేందుకు జైళ్లో ఉన్న టెర్రరిస్టులు ప్రయత్నించారన్న కీలక ఆధారాలతో విచారణ చేపట్టింది. ఈ విచారణలో సైకాలజిస్ట్ బయట ఫోన్ ను 8 వేల రూపాయలకు కొని.. ఉగ్రవాదులకు 25 వేలకు అమ్ముతున్నట్లు బయటపడింది. 

తడియంతవిడే నసీర్ (47) అనే నిందితుడు.. లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో విచారణ ఖైదీగా బెంగళూరు జైల్లో ఉన్నాడు. అయితే బెంగళూరు సెంట్రల్ జైల్లో నసీర్ తో పాటు ఇతర కరుడుగట్టిన ఉగ్రవాదులు, నేరస్తులకు సైకాలజిస్ట్ డా.ఎస్.నాగరాజు ఫోన్లు సరఫరా చేస్తున్న కేసులో జులై 8న అరెస్టయ్యాడు. కేరళలో ఉగ్రవాదం, 2008లో బెంగళూరులో వరుస బాంబు పేలుళ్ల కేసులో నసీర్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. దీనితో పాటు జైల్లో ఉన్న యువ ఖైదీలను ఉగ్రవాదులుగా మార్చే ప్రయత్నం చేసిన కేసులో కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 

►ALSO READ | దృశ్యం సినిమా స్టైల్లో మర్డర్.. భర్తను చంపి టైల్స్ కింద పాతిపెట్టింది.. చివరికి ఎలా తెలిసిందంటే..

అయితే జైలు అధికారుల మధ్యవర్తిత్వంతో సైకాలజిస్ట్ ఫోన్లు అమ్ముతున్నట్లు గుర్తించిన ఎన్ఐఏ.. కర్ణాటకలో మర్డర్ కేసులో జైల్లో ఉన్న ఖైదీని విచారించి ఆధారాలు రాబట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. ఖైదీని కీలక ప్రశ్నలు అడిగిన అధికారులు.. సైకాలజిస్ట్ ఫోన్లు అందిస్తున్నట్లు తెలుకున్నారు. ఇటీవల రిసార్ట్స్ కు టూర్ కు వెళ్లిన మానసిక వైద్యుడు.. ఫోన్లను సేకరించి.. ఖైదీలకు అందిస్తున్నట్లు నిర్ధారించారు. 

ఫోన్లను రఘు అనే ఫేక్ నేమ్ తో కొనుగోలు చేసి ఉగ్రవాదులకు అందిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఒక్కో ఫోన్ ను 8 వేల నుంచి 10 వేల లో పు కొని.. 25, 30 వేలకు అమ్ముతున్నట్లు అంగీకరించాడు సైకాలజిస్ట్.  జైల్లోకి ఫోన్లు తరలించి అమ్మడం వలన ఫోన్ల ధరతో పాటు భారీ ఎత్తున డబ్బులు ముట్టినట్లు అధికారులు నిర్ధారించారు. ఇలా ఫోన్ల స్మగ్లింతో ఏకంగా కోటి రూపాయలు సంపాదించడం అధికారులను విస్మయానికి గురిచేసింది. నసీర్ తో పాటు చాలా మంది ఉగ్రవాదులు, ఖైదీలకు ఫోన్లను అమ్ముతున్నట్లు నిర్ధారించిన అధికారులు సైకాలజిస్ట్ పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.