
సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కోదాడ పురపాలక సంఘం పరిధి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి 65పై వై జంక్షన్ దగ్గర కారు కల్వర్టును ఢీ కొట్టడంతో కారులో నుంచి మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వాళ్లు కారు దిగి అక్కడి నుంచి పారిపోవడంతో సేఫ్ గా బయటపడ్డారు.
స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. కారు పూర్తిగా దెబ్బతింది. దీంతో హైవేపై కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. అనంతరం ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. కారు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
►ALSO READ | సూర్యాపేటలో 8 కిలోల బంగారం చోరీ .. బాత్రూం గోడకు రంధ్రాలు చేసి షట్టర్ ధ్వంసం
ఈ మధ్య రన్నింగ్ కార్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగుతున్న ఘటనలు చాలా వరకు జరుగుతున్నాయి. ఎందుకైనా మంచిది కారులో జర్నీ చేసే ముందు కారు ఫిట్ నెస్ ఎలా ఉంది..వర్కింగ్ లో ఉందా? లేదా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని పరిశీలించి ప్రయాణించడం బెటర్.