
తాప్సీ.. ఒకప్పుడు మామూలు హీరోయిన్‌గానే మనకి తెలుసు. కానీ బాలీవుడ్ వెళ్లిన తర్వాత ఆమె ఇమేజ్ మారిపోయింది. ఇంపార్టెన్స్ పెరిగింది. వరుస విజయాలు ఆమెను బిజీ హీరోయిన్‌ని చేశాయి. హీరో పక్కన మెరిసే హీరోయిన్‌గా కాకుండా.. ఒక్కదాన్నే సినిమా భారాన్ని మోయగలను, వంద కోట్లు రాబట్టగలను అని ప్రూవ్ చేసిందామె. ఇప్పుడు ఒక కాలేజ్ జిమ్‌కి ఏకంగా తన పేరు పెడుతున్నారంటే ఆమె ఫాలోయింగ్, పాపులారిటీ ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తాప్సీ నటించిన ‘థప్పడ్’ ఈ నెలాఖరున విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్ మిథూ’తో పాటు ‘రష్మీ రాకెట్’ అనే సినిమా కూడా చేస్తోంది. ఈ చిత్రంలో ఆమె కచ్ ప్రాంతానికి చెందిన అథ్లెట్‌గా కనిపించనుంది. హరిద్వార్‌లో షూటింగ్ జరుగుతోంది. స్పోర్ట్స్ పర్సన్‌గా ఫిట్‌నెస్‌తో కనిపించాలి కనుక రోజూ జిమ్ చేయాలి. కానీ అక్కడ అటువంటి సదుపాయం లేకపోవడంతో స్థానికంగా ఉన్న గురుకుల్ కాంగ్రీ వర్సిటీలో ఉన్న జిమ్‌లో వర్కవుట్ చేస్తోంది. ఏమాత్రం తీరిక దొరికినా అక్కడే టైమ్ గడుపుతోందట. ఫిట్‌గా ఉండటానికి ఎంతో కష్టపడుతోందట. నెల రోజులుగా ఆమె చేస్తున్న ఈ కృషిని చూసిన కాలేజ్ యాజమాన్యం.. ఆ జిమ్‌కి తాప్సీ పేరు పెట్టేందుకు నిర్ణయించుకున్నారు. రీసెంట్‌గా ఆమెను ఆహ్వానించి, సన్మానించి, ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. ఊహించని ఈ గౌరవానికి తాప్సీ ఆశ్చర్యపోయింది. ఇంతలోనే ఎంత ఎదిగిందీ అంటూ దేశమంతా ఆమెను పొగుడుతోంది.