జూనియర్ వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిఫ్టింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తారాకు సిల్వర్

జూనియర్ వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిఫ్టింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తారాకు సిల్వర్

అస్తానా: ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిఫ్టింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా లిఫ్టర్ పుంగ్ని తారా సిల్వర్ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెరిసింది. యూత్ గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 44 కేజీ కేటగిరీలో తను ఈ పతకం నెగ్గింది. శుక్రవారం జరిగిన పోటీలో తారా మొత్తంగా 141 కేజీలు (స్నాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 60 కేజీలు + క్లీన్ అండ్ జెర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 81 కేజీలు) బరువు ఎత్తి రెండో స్థానంలో సాధించింది. క్లీన్ అండ్ జెర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎత్తిన 81 కేజీలకు గాను తనకు గోల్డ్ మెడల్ లభించింది. కాంటినెంటల్, వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీల్లో స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్, మొత్తం లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విడివిడిగా పతకాలు అందజేస్తారు.