
తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు నందమూరి తారకరామారావు(Nandamuri Taraka Ramarao). నటుడిగా, మహానేతగా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేశారు ఆయన. నేడు(మే 28) ఆయన 101వ జయంతి సంధర్బంగా ప్రముఖులు ఆయనకు నివాళు అర్పిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ, అభిమానులు, తెలుగుదేశం నాయకులు, శ్రేణులు హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్దకు పెద్దఎత్తున చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు.
ఇందులో భాగంగానే ఆయన మనవలు తారక్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కి నివాళులు అర్పించాడు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి తమ తాతయ్యకు నివాళులు అర్పించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.