
ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ .. పోస్టల్ సేవలపై కూడా పడింది. ఆగస్టు 25నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియా పోస్ట్ విభాగం ప్రకటించింది. ట్రంప్ డ్యూటీ ఫ్రీ డి మినిమిస్ మినహాయింపు రద్దు చేస్తుండంతో భారత్ తాత్కాలికంగా అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
అధ్యక్షుడు ట్రంప్ జూలై 30న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నంబర్ 14324పై సంతకం చేశారు. ఈ ఉత్తర్వుతో అమెరికాలోకి వస్తువులపై ఉన్న USD 800 వరకు ఉన్న డ్యూటీ-ఫ్రీ డి మినిమిస్ మినహాయింపును ఆగస్టు 29, 2025 నుంచి రద్దు చేశారు. దీని ప్రకారం..ప్రపంచ వ్యాప్తంగా USPS ద్వారా అమెరికాకు వెళ్లే అన్ని వస్తువులు కస్టమ్స్ సుంకాల కిందికి వస్తాయి.ఎక్కడెక్కడైనా విదేశాల నుంచి పోస్ట్ చేస్తున్న లేఖలు, డాక్యుమెంట్లు ,USD 100 లోపు విలువ గల గిఫ్ట్ అయిటమ్స్ మినహాయింపు పొందుతాయి.
ALSO READ : మా వస్తువులు కొనకండి..
కస్టమ్స్ సుంకాలని వసూలు చేసే విధానం ఇంకా పూర్తి స్పష్టతకు రాలేదు. ఇంకా అమెరికా కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుండి గైడ్లైన్స్ లేవు. అందువల్ల USPSతో కలిసి పని చేస్తున్న అంతర్జాతీయ తపాలా సంస్థలు, USA bound items కోసం టెక్నికల్/ఓపరేషనల్ సపోర్ట్ అందుబాటులో లేదని కొనుగోలు మేసేజ్ లను నిలిపేశాయి. దీంతో ఎక్కువ దేశాలు USPSకు తపాలా సేవలను (లేఖలు, డాక్యుమెంట్లు, USD 100 లోపు గిఫ్ట్ లు తప్ప) ఆగస్టు 25నుంచి నిలిపివేశారు. అందులో భారత్ కూడా ఉంది. ఇకపై USPSకు, USD 100 లోపు విలువ గల ప్రవేట్ గిఫ్ట్ లు, లెటర్లు మాత్రమే పోస్టు చేయవచ్చు.ఇప్పటికే పంపిన వస్తువులపై కస్టమర్లు తపాలా శాఖ నుంచి రీఫండ్ పొందవచ్చు.
తాజా ట్రంప్ సుంక పాలసీలతో..
అమెరికాకు (USPS ద్వారా) తపాలా/పార్సెల్ పంపే సేవలు తాత్కాలికంగా నిలిపివేశాయి.
లెటర్లు, డాక్యుమెంట్లు, USD 100 లోపు గిఫ్ట్ లు మాత్రమే మినహాయింపుతో పంపొచ్చు.
మిగితా వస్తువులపై కస్టమ్స్ సుంకం కిందకు వస్తాయి. స్పష్టమైన అమలు రూల్స్ ఇంకా తెలియవు.
ఈ పరిస్థితిని గట్టేందుకు USPS, USPS భాగస్వామ్య దేశాలు, తపాలా సంస్థలు సమన్వయం చేస్తుండటంతో త్వరలో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.