
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు విదేశాంగ మంత్రిజైశంకర్. మీరు సుంకాలు పెంచుతూ పోతే మేం మాకేం నష్టమేమీ లేదు.. మా వస్తువులు కొనకండి.. మిమ్మల్ని మా వస్తువులు కొనమని ఎవరూ బలవంతం చేయడం లేదంటూ కౌంటర్ ఇచ్చారు జైశంకర్.
ఢిల్లీలో జరిగిన ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2025లో ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన జైశంకర్.. రష్యానుంచి చమురు ఇతర ఉత్పత్తులు భారత్ దిగుమతి చేసుకుంటే మీకేం నష్టం.. మీకేదైన సమస్య ఉంటే కొనకండి.. ఎవరూ మిమ్మల్ని కొనమని బలవంతం చేయరు అని అన్నారు. అమెరికాతో వ్యాపారం చేసేవారు ఇతరులతో వ్యాపారం చేయకూడదని చెప్పడం సరికాదన్నారు.
మాకు మా రైతుల ప్రయోజనాలు, కింది స్థాయి ఉత్పత్తిదారుల ప్రయోజనాలు ముఖ్యం.. వాటిని కాపాడుకునేందుకు మేం కట్టుబడి ఉన్నామని జైశంకర్ అన్నారు. రైతు ప్రయోజనాల విషయంతో రాజీపడం అని తేల్చి చెప్పారు.
ALSO READ : ఇంటెల్ కంపెనీలో 10% వాటా దక్కించుకున్న ట్రంప్ సర్కార్..!
రష్యానుంచి చమురు కొనుగోలు విషయంలో చైనా , ఈయూ, ఇతర దేశాలు కూడా ఇలాంటి సంబంధాలు కలిగి ఉన్నాయి. అయినప్పటికీ వాటికి సుంకాలు పెంచలేదని స్పష్టం చేశారు.
అమెరికా భారత్ ను వేరు చేస్తుందా?
అమెరికా పక్షపాత ధోరణిని అమలు చేస్తుందని జైశంకర్ ఆరోపించారు. చైనా పెద్ద ఎత్తున రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది. అయిన వాణిజ్య పరమైన సుంకాలు లేవని జైశంకర్ అన్నారు.
భారత్ చమురు కొనుగోలు ప్రపంచ మార్కెట్ విధానాలు, అవసరాలకు అనుగుణంగా ఉంది.. ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థీరీకరించేందుకు రష్యానుంచి చమురు కొనుగోలును గతంలో అమెరికా స్వయంగా భారత్ ను ప్రోత్సహించిందన్నారి గుర్తు చేశారు జైశంకర్.