
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇంటెల్ సీఈవో లిప్-బూ టాన్ ను రాజీనామా చేయమని కోరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికా ప్రభుత్వం ఆ కంపెనీలో 10% వాటాను కొనుగోలు చేయబోతోందని ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందంలో అమెరికా ప్రభుత్వం ఇంటెల్ షేర్లలో 433.3 మిలియన్ షేర్లను 20.47 డాలర్ల చొప్పున కొనుగోలు చేసేందుకు దాదాపు 8.9 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం రూ.75వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడైంది. స్టాక్.. మార్కెట్ ధర కంటే సుమారు 4డాలర్ల తక్కువదిగా ఉంది.
ఈ పెట్టుబడి భాగంగా 5.7 బిలియన్ డాలర్లు మాత్రం చిప్స్ అండ్ సైన్స్ యాక్ట్ ద్వారా గ్రాంట్స్ నుంచి వస్తుందని వెల్లడైంది. ఇక మిగిలిన3.2 బిలియన్ డాలర్లను రక్షిత చిప్ తయారీ కోసం అమెరికా ఇవ్వబడుతోంది. ట్రంప్ ఈ ఒప్పందాన్ని "అద్భుతమైన డీల్" అని అభివర్ణించారు. అలాగే లిప్-బూ టాన్ కూడా ఇంటెల్ లో కొనసాగుతారని చెప్పారు. ట్రంప్ గతంలో లిప్-బూ టాన్‌ను చైనా కంపెనీలకు అతని సంబంధాల కారణంగా కంపెనీ సీఈవో స్థానానికి అనర్హుడని విమర్శించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ ఒప్పందం ద్వారా ప్రభుత్వం కంపెనీలో భాగస్వామిగా మారుతోంది.
ALSO READ : సూపర్ లాభాలిచ్చిన మిడ్ క్యాప్స్ ఫండ్స్ ఇవే..
ఇప్పటికే ఇటీవల సాఫ్ట్ బ్యాంక్ కూడా ఇంటెల్‌లో 2% వాటాను కొన్న సంగతి తెలిసిందే. ఇంటెల్ ప్రస్తుతం 20వేల ఉద్యోగులను తొలగించే ప్రణాళికలో ఉంది. ఇది కొన్ని సంవత్సరాలుగా తీసుకున్న వ్యూహాత్మక తప్పుల పరిష్కారానికి భాగంగానే ఉంది. అమెరికా ప్రభుత్వం తాజా పెట్టుబడితో సంస్థ పాలనా హక్కులు పొందకుండా, కేవలం సంస్థ అభివృద్ధికి మద్దతుగా ఈ పెట్టుబడిని పెట్టిందని తెలుస్తోంది. దీని ప్రధాన ఉద్దేశ్యం దేశంలో సాంకేతిక విద్యుత్ చిప్ ఉత్పత్తిని పెంచడం, అమెరికాకు గ్లోబల్ సాంకేతిక ఆధిక్యతను కొనసాగించడమే. ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో టెక్ పరిశ్రమపై ప్రభుత్వం ప్రో-చైనా వ్యతిరేక చర్యలకు ముందడుగు తీసినట్లు తెలుస్తోంది.