
Mid-cap Funds: కరోనా తర్వాతి నుంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పెట్టుబడులకు మంచి ఆదరణ లభిస్తోంది. చాలా మంది ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవటం ఇష్టం లేక ఈక్విటీల కంటే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అని అనుకుంటున్నారు. అయితే ఏదైనా స్కీమ్ ఎంచుకోవటానికి ముందు దాని గత రాబడులతో పాటు అదే కేటగిరీలో పనిచేస్తున్న ఇతర స్కీమ్స్ ఎలా ఉన్నాయనే విషయాలను కూడా చూసుకోవాల్సి అవసరం ఉంటుంది. అయితే గతంలో ఇచ్చినట్లే లాభాలు వస్తాయి అని ఊహించుకోవటం పొరపాటే. ఇది నిర్ణయానికి మార్గనిర్థేశంగా మాత్రమే నిలుస్తుంది.
ఇక ఫండ్ ఎంపికలో ముఖ్యమైన అంశం దానిని మేనేజ్ చేస్తున్న వ్యక్తి పనితీరు.. అలాగే మనం సెలెక్ట్ చేసుకుంటున్న స్కీమ్ ఫ్లోచ్ చేస్తున్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అయితే 5 ఏళ్లలో మంచి పనితీరుతో 25 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించిన మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫండ్స్ కనీసం తమ డబ్బును 65 శాతం మిడ్ క్యాప్ కేటగిరీలోని కంపెనీల్లో పెట్టుబడిగా పెడుతుంటాయి.
ALSO READ : అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్ ఆఫీసులపై సీబీఐ సోదాలు..
మిడ్ క్యాప్ ఫండ్ దాని పనితీరు..
- Sundaram Mid cap fund : 26.35
- Union mid cap fund : 25.84
- HDFC Mid Cap Fund : 28.81
- ICICI Pru Midcap fund : 26.16
- Invesco India mid cap fund : 28.31
- Edelweiss Mid Cap Fund : 29.23
- Kotak Midcap fund : 27.46
- Mahindra Manulife MCF : 27.01
- Mirae Asset Midcap fund : 25.98
- Motilal Oswal Midcap Fund : 33.31
- Nippon India Growth MCF : 28.93
- Quant mid cap fund : 27.24
- SBI mid cap fund : 25.39
పైన ఉన్న స్కీమ్స్ లిస్ట్ పరిశీలిస్తే మోతీలాల్ ఓస్వాల్, ఎడిల్వీస్, నిప్పాన్, హెచ్డీఎఫ్సీ, ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ ఫండ్స్ మిడ్ క్యాప్ కేటగిరీలో ఉత్తమ రాబడులను అందించాయి. అందుకే మ్యూచువల్ ఫండ్స్ ఎంపిక విషయంలో కొంత రీసెర్చ్ చేయటం చాలా ముఖ్యం.