
ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి ఘటనపై అర్వింద్ ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పరామర్శించారు. ఇవాళ ఆయన అర్వింద్ ఇంటికి వచ్చారు. దాడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడారు. ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ అహంకారంతో దాడి చేసిందన్నారు. ఇంట్లో ఉన్న మహిళలపై కూడా దాడి చేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందని మండిపడ్డారు.
టీఆర్ఎస్ హింసను ప్రోత్సహిస్తుందని తరుణ్ చుగ్ ఆరోపించారు. తాము అహింసతో టీఆర్ఎస్ ను ఎదురుకుంటామన్నారు. తెలంగాణలో ఈ రావణ రాజ్యాన్ని అంతం చేస్తామని వెల్లడించారు. హింస, అహంకారంతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ దాడి ఘటనపై అమిత్, జేపీ నడ్డాతో మాట్లాడుతామన్నారు. బీజేపీ అర్వింద్ కు అండగా ఉంటాదని ఆయన భరోసా ఇచ్చారు.