గుట్కా విక్రయ కేంద్రాలపై పోలీసుల దాడులు

గుట్కా విక్రయ కేంద్రాలపై పోలీసుల దాడులు

వికారాబాద్ జిల్లా:  పరిగి పట్టణంలో టాస్క్ ఫోర్స్,  సివిల్ పోలీసులు దాడులు నిర్వహించారు. గుట్కా అమ్ముతున్నారనే పక్కా  సమాచారంతో రామలింగేశ్వర కిరాణా షాపులో తనిఖీ చేయగా... గుట్కాలు, జర్దా, సిగరెట్లు లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారు 50 వేల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అదే దుకాణంలో నిల్వ ఉంచిన పది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని  కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోచోట పరిగి నుంచి మల్కాపూర్ వైపు ఆటోలో( TS 34 TA 8070) అక్రమంగా తరలిస్తున్న 10  క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

అనంతరం కిరాణం షాపు యజమాని, ఆటో డ్రైవర్లపై కేసు నమోదు చేశామన్న పోలీసులు... ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించామని తెలిపారు. అక్రమంగా గుట్కా, రేషన్ బియ్యం వంటివి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.