మెడికోల మానసిక స్థితిపై స్టడీకి టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌

మెడికోల మానసిక స్థితిపై స్టడీకి టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: మెడికోల మానసిక స్థితి, ఆత్మహత్యలపై అధ్యయనం చేసేందుకు నేషనల్​మెడికల్​కమిషన్​(ఎన్ఎంసీ) నేషనల్ టాస్క్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌లో 15 మంది సభ్యులుంటారని పేర్కొంది. దీనికి చైర్మన్​గా డాక్టర్ బీఎం సురేశ్​ను నియమించింది. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్​ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్​లోని సైకియాట్రీ విభాగం ప్రొఫెసర్​గా పనిచేస్తున్నారు.

 టాస్క్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ టీం ఈ ఏడాది మే 31 నాటికి తన అధ్యయన నివేదికను అందించాలని ఎన్ఎంసీ తన అధికారిక వెబ్​సైట్​లో పేర్కొంది. వైద్య విద్యార్థుల మానసిక ఆరోగ్యం దెబ్బతినడం, ఆత్మహత్యలపై ఇప్పటికే అందుబాటులో ఉన్న గణాంకాలపై ఈ టీం అధ్యయనం చేయనుంది. ఈ సవాళ్లపై తగిన ఆధారాలను సేకరించి, వాటిపై స్టడీ చేస్తుంది. అందుకోసం మెడికోలు సూసైడ్ చేసుకున్న వైద్య కళాశాలలకు బృందం వెళ్లనుంది. ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషించనుంది. అధ్యయనం తర్వాత వైద్యవిద్యార్థుల్లో మా నసిక ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు ఆత్మహత్యల నివారణకు తగిన సూచనలు చేస్తుంది.