మంథని పట్టణంలో రేషన్ బియ్యం పట్టివేత

మంథని పట్టణంలో రేషన్ బియ్యం పట్టివేత

మంథని, వెలుగు : పట్టణం లోని గంగాపురి శివారుతో పాటు, లైన్ గడ్డ ఏరియాలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని  టాస్క్ ఫోర్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. గంగాపురిలో ఓ గుడిసెలో రేషన్ బియ్యం నిల్వ ఉంచారని, అలాగే లయన్ గడ్డ ఏరియాలో ఓ ఇంట్లో రేషన్ బియ్యం ను తక్కువ ధరకు కొని నిల్వ చేసి ట్రాలీ లో తరలిస్తున్నారనే సమాచారం తో  పట్టుకున్నట్టు తెలిపారు. 

ఈ తనిఖీల్లో  మొత్తం 60 క్వింటాళ్ల బియ్యం దొరికినట్టు తెలిపారు.  ఈ బియ్యాన్ని రాచర్ల రమేశ్​తో పాటు సయ్యద్ అస్లాం  నిల్వ చేసినట్టు అధికారులు తెలిపారు. పట్టుకున్న రైస్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు