
దేశంలోని ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ టాటా AIG పాలసీదారులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. మ్యాక్స్ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ క్లెయిమ్ సదుపాయం సెప్టెంబర్ 10, 2025 నుంచి నిలిపివేసినట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం టాటా AIG ఆరోగ్య బీమా కంపెనీ, మ్యాక్స్ హెల్త్‌కేర్ మధ్య టారిఫ్ వివాదాల కారణంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టార్ హెల్త్, నివా బుపా ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మ్యాక్స్ హాస్పిటల్స్‌తో క్యాష్‌లెస్ సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
టాటా AIG 2025 జనవరి 16న ప్రారంభమైన రెండు సంవత్సరాల టారిఫ్ ఒప్పందాన్ని జూలై 2025లో అకస్మాత్తుగా తగ్గించమని కోరినట్లు మ్యాక్స్ హెల్త్‌కేర్ చెప్పింది. ఈ తగ్గింపు ఖర్చులు రోగులకు అందించే సేవల నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మ్యాక్స్ హాస్పిటల్స్ చెబుతోంది. టాటా AIG ఒప్పందంలో మార్పు చేపట్టకపోవడంతో.. క్యాష్‌లెస్ క్లెయిమ్ సేవలను మ్యాక్స్ హాస్పిటల్స్‌లో నిలిపివేయగా, రోగులు ముందుగా డబ్బు చెల్లించి తరువాత క్లెయిమ్ రీయింబర్స్‌మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ALSO READ : 10 ఏళ్లుగా ఇండస్ఇండ్ బ్యాంకు లెక్కల్లో అవకతవకలు..
మ్యాక్స్ హాస్పిటల్స్ రోగులకు సులభంగా రీయింబర్స్‌మెంట్ తీసుకునేందుకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ డెస్క్ ఏర్పాటు చేసింది. టాటా AIG కూడా తన పాలసీహోల్డర్లకు క్లెయిమ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరగతిన క్లెయిమ్‌లను ప్రాసెస్ చేస్తానని హామీ ఇస్తోంది. ఈ వివాదం కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వంటి ఇతర కంపెనీల మధ్య కూడా ఉంది. ముఖ్యంగా మ్యాక్స్ హాస్పిటల్స్ ఢిల్లీ NCR ప్రాంతంలో హెల్త్ క్యాష్‌లెస్ క్లెయిమ్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ పరిశ్రమలో ఇన్సూరర్‌లు.. హాస్పిటల్స్ మధ్య టారిఫ్ వివాదాలు తీవ్ర స్థాయికి చేరినట్లు ప్రస్తుత పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. దీనికి ఇన్సూరెన్స్ కంపెనీలు హాస్పిటల్స్ వెంటనే పరిష్కరించుకోవటం రోగుల అసౌకర్యాన్ని తగ్గించటం అత్యవసరం.