టాటాతో టెస్లా డీల్.. సెమీకండక్టర్ చిప్స్ తయారీ

టాటాతో టెస్లా డీల్.. సెమీకండక్టర్ చిప్స్ తయారీ

ప్రపంచం టెక్నాలజీ రంగంలోనే బిగ్ డీల్.. ఇండియా టాప్ కంపెనీ టాటాతో ఒప్పందం చేసుకున్నది టెస్లా. ఇండియాలో సెమీకండక్టర్ చిప్స్ తయారీకి సంబంధించి.. టాటా, టెస్లా కలిసి పెద్ద యూనిట్ ఏర్పాటు చేయబోతున్నాయి. టెస్లాకు కావాల్సిన చిప్స్ టాటా ఫ్యాక్టరీల నుంచి ఎగుమతి కానున్నాయి.

ఇక టాటా విషయానికి వస్తే.. ఇప్పటికే సెమీకండక్టర్ చిప్స్ తయారీలో యూనిట్స్ ఏర్పాటు చేస్తుంది. టాటా ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో.. హోసూర్, అసోం, ధలేరా ప్రాంతాల్లో తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తుంది. దీని కోసం ఇప్పటికే 14 వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది టాటా.

ఏప్రిల్ నెలలో టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ ఇండియా పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా టాటా, టెస్లా డీల్ పై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. టాటా ఎలక్ట్రానిక్స్ లో ఎలన్ మస్క్ ఎంత పెట్టుబడి పెడుతున్నారు.. ఎంత వాటా తీసుకుంటున్నారు.. డీల్ పూర్తి వివరాలు ఏంటీ అనేది మాత్రం రెండు కంపెనీలు వెల్లడించలేదు. 

ఇప్పటికే సెమీకండక్టర్ చిప్స్ కొరత ప్రపంచ దేశాలను వేధిస్తుంది. ప్రస్తుతం ఈ మార్కెట్ లో తైవాన్ వాటా ఎక్కువ. అంతుకు మించి డిమాండ్ ఎక్కువగా ఉంది. సెమీకండక్టర్ చిప్స్ కొరత వల్ల కార్ల తయారీ ఆలస్యం అవుతుంది. అదే విధంగా టీవీలు, ఇతర హోం అప్లయినెన్స్ లో వినియోగించే చిప్స్ కొరత ఎక్కువగా ఉంది. ఈక్రమంలోనే టాటా ఎలక్ట్రానిక్స్ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని యూనిట్స్ ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే 14 వందల కోట్లు పెట్టుబడి పెట్టిన టాటా ఎలక్ట్రానిక్స్.. టెస్లా ఎంట్రీతో మరిన్ని యూనిట్స్ ఏర్పాటు చేస్తుందా లేక ఉన్న ప్రాజెక్టులోనే వాటా తీసుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.