భారీ నష్టాల్లో టాటా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్టర్లు

భారీ నష్టాల్లో టాటా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్టర్లు
  • గత పది సెషన్లలో తొమ్మిది సార్లు లోయర్ సర్క్యూట్ టచ్ చేసిన షేర్లు

న్యూఢిల్లీ: టాటా సన్స్ ఐపీఓ ఉండకపోవచ్చనే వార్తలు రావడంతో టాటా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ షేర్లు భారీగా పడుతున్నాయి. కిందటి వారం ఈ కంపెనీ షేర్లు 21 శాతం నష్టపోయాయి. అంతకు ముందు వారంలో 22 శాతం పడ్డాయి. టాటా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్ షేర్లు శుక్రవారం ఐదు శాతం తగ్గి వరుసగా తొమ్మిదో సెషన్‌‌‌‌‌‌‌‌లోనూ లోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌ టచ్ చేశాయి.

  కంపెనీ షేర్లు ఈ నెల 7 న  రూ.9,756 దగ్గర ఆల్‌‌‌‌‌‌‌‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి.  అక్కడి  నుంచి 38 శాతం క్రాష్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. శుక్రవారం రూ.5,960 దగ్గర క్లోజయ్యాయి. టాటా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ ఇన్వెస్టర్లు గత 10 సెషన్లలో రూ.20 వేల కోట్లు నష్టపోయారు. కేవలం రెండు వారాల్లోనే  కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్  రూ.49,365 కోట్ల నుంచి రూ.30,155 కోట్లకు తగ్గింది. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ రూల్స్ ప్రకారం టాటా సన్స్ ఐపీఓ వచ్చే ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోపు ఉంటుందని  రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో ఈ నెల మొదటి వారంలో కంపెనీ షేర్లు వరుస సెషన్లలో అప్పర్ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌ను టచ్ చేశాయి.