50 లక్షల వెహికల్స్ అమ్మకాలు పూర్తి చేసిన టాటా

50 లక్షల వెహికల్స్ అమ్మకాలు పూర్తి చేసిన టాటా

టాటా మోటార్స్.. 50 లక్షల ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు పూర్తి చేసింది. అక్షరాల 50 లక్షలు.. ఈ విషయాన్ని సగర్వంగా ప్రకటించింది ఆ కంపెనీ యాజమాన్యం. 2004లో 10 లక్షల మైలురాయిని.. 2010లో 20 లక్షల వాహనాలను విక్రయించగా.. 2015 నాటికి అది 30 లక్షలకు చేరుకుతంది. 2020 నాటికి 40 లక్షల ప్యాసింజర్ వాహనాలను తయారు చేయటమే కాదు.. ఆ మొత్తాన్ని మార్కెట్ లో అమ్మేసింది. ఆశ్చర్యకరంగా 2023 నాటికి ఏకంగా 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసింది. జస్ట్ మూడేళ్లలో 10 లక్షల వెహికల్స్ తయారు చేసిన ఘనతను టాటా మోటార్స్ సాధించింది. 

కరోనా తర్వాత కార్లకు, ప్యాసింజర్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ రావటంతో.. ఉత్పత్తిని పెంచి కస్లమర్లకు అందించినట్లు టాటా కంపెనీ  స్పష్టం చేసింది. 2004లో ప్రారంభం అయిన ప్యాసింజర్ వాహనాల తయారీలో.. 2023 కీలక మలుపుగా అభివర్నించింది కంపెనీ. 50 లక్షల వాహనాల ఉత్పత్తిని పూర్తి చేసిన క్రమంలో.. నెల రోజులపాటు కంపెనీ ఉద్యోగులతోపాటు  డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

భారతదేశ అభివృద్ధిలో టాటా మోటార్స్ భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం అయ్యిందని ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ తీసుకొచ్చామని.. ప్రతి మోడల్ ప్రజాదరణ పొందటం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. రాబోయేది ఎలక్ట్రికల్ యుగం అని.. అందులోనూ టాటా మోటార్స్ తన చరిత్రను ప్రత్యేకంగా రాస్తుందనే ధీమా వ్యక్తం చేశారాయన. టాటా బ్రాండ్ అనేది ప్రజల విశ్వాసంతో ముడిపడిందని.. దాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటాం అని స్పష్టం చేశారు. 50 లక్షల మైలురాయిని చేరుకోవటానికి సహకరించిన ప్రతి కస్టమర్ కు ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు. ఉద్యోగులు, కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు, ఛానెల్ పార్టనర్స్ అందరూ ఇందులో భాగస్వామ్యం అయ్యారని.. వాళ్లందరూ ఈ ఉత్సవాల్లోనూ భాగస్వామ్యం అవుతారని స్పష్టం చేశారాయన.