
టాటా మోటార్స్ భారత మార్కెట్లో 7 లక్షల నెక్సాన్ యూనిట్లను విక్రయించినట్టు ప్రకటించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ డీలర్లు షోరూమ్‌లు ప్రత్యేక కార్యక్రమాలను, కస్టమర్ మీట్‌లను నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా నెక్సాన్ కొంటే రూ.లక్షల వరకు ప్రయోజనాలు కూడా ఉన్నాయని టాటా మోటార్స్ తెలిపింది. జూన్ 30 వరకు చేసిన బుకింగ్‌లకు మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయి.