టాటా మోటార్స్ నికర లాభం 133 శాతం అప్​

టాటా మోటార్స్ నికర లాభం 133 శాతం అప్​

 

  •      మూడో క్వార్టర్​లో రూ.7,100 కోట్లు
     

ముంబై :  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్​లో టాటా మోటార్స్ లిమిటెడ్ నికర లాభం133.32 శాతం వృద్ధితో రూ. 7,100 కోట్లకు చేరుకుంది.   గత ఏడాది కాలంలో కంపెనీ రూ. 3,043 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్​లో  ఆదాయం (కన్సాలిడేటెడ్​) ఏడాది ప్రాతిపదికన 25 శాతం పెరిగి రూ.1,10,600 కోట్లకు చేరుకుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. "మేం మూడు ఆటో వ్యాపారాలపై సానుకూలంగానే ఉన్నాము.  కొత్త లాంచ్‌‌‌‌లు, జేఎల్​ఆర్​లో సరఫరాలను మెరుగుపరచడం వంటి కారణాల వల్ల  మార్చి క్వార్టర్​లో పనితీరు మరింత బాగుంటుంది " అని టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబరు క్వార్టర్​లో రూ. 9,500 కోట్ల అప్పును తీర్చగలిగామని  టాటా మోటార్స్ తెలిపింది.