దూసుకుపోతున్న టాటా మోటార్స్‌!

దూసుకుపోతున్న టాటా మోటార్స్‌!
  • పెరుగుతున్న సేల్స్‌‌‌‌.. రికార్డ్‌‌ లెవెల్‌‌కు టర్నోవర్‌‌‌‌
  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల యూనిట్ల అమ్మకాలే టార్గెట్‌‌

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: సేల్స్ పెరుగుదలలో ఆటో ఇండస్ట్రీలోని మిగిలిన కంపెనీలను టాటా మోటార్స్ దాటేస్తోంది. కంపెనీ సేల్స్ పుంజుకుంటున్నాయి. కంపెనీ చరిత్రలోనే అత్యధిక సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌ను కిందటేడాది టాటా మోటార్స్ సాధించింది. నెక్సాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పంచ్ వంటి మోడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ పెరుగుతుండడంతో కంపెనీ సేల్స్ భారీగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి–మార్చి పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా  టాటా మోటార్స్ సేల్స్ రికార్డ్ లెవెల్లో ఉంటాయని ఇండస్ట్రీ ఎక్స్‌‌పర్టులు చెబుతున్నారు. ఈ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మొత్తం 1,25,000 వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంపెనీ అమ్ముతుందని అంచనావేస్తున్నారు. 

సెమీ కండక్టర్ల సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొంత మెరుగుపడడంతో సేల్స్ ఊపందుకుంటున్నాయని పేర్కొన్నారు. కంపెనీ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ జనవరి–మార్చి పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా పెరిగితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ సేల్స్ 3,70,000 మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్రాస్ చేస్తుందని చెప్పారు.  2020–21 ఆర్థిక సంవత్సరంలో సాధించిన సేల్స్ కంటే ఈ సారి కంపెనీ సేల్స్ 60 శాతం పెరుగుతాయని అంచనా. ఆర్డర్స్ పెరగడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సేల్ చేయాలని టాటా మోటార్స్ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. ఇంకా చెప్పాలంటే మొత్తం ఆరు లక్షల యూనిట్లకు లేదా నెలకు 50 వేల యూనిట్లకు  సరిపడ స్పేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టులను సప్లయ్ చేయడానికి రెడీగా ఉండాలని సప్లయర్లకు కంపెనీ ముందే సూచించిందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు.  

టర్నోవర్ రూ. 40 వేల కోట్లు

జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,25,000 వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టాటా మోటార్స్ అమ్మగలిగితే, కంపెనీ రెవెన్యూ రూ. 10,000 కోట్లకు చేరుతుందని అంచనా. 2022–23 ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం పెట్టుకున్న 5–6 లక్షల యూనిట్ల టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా చేరుకోగలిగితే మొత్తం రూ. 40–50 వేల కోట్ల టర్నోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంపెనీ సాధిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి తొమ్మిది నెలల్లో రూ. 22 వేల కోట్ల రెవెన్యూని కంపెనీ ప్రకటించింది. సేల్స్ కొద్దిగా పెరిగి ఉంటే కంపెనీ ఇబిటా ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చేదని, ఈ జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంపెనీ ఇబిటా ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు.  కిందటేడాది డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 8,600 కోట్ల రెవెన్యూని కంపెనీ ప్రకటించింది.