టాటా కొత్త ఆల్ట్రోజ్ @ రూ. 6.89 లక్షలు

టాటా కొత్త  ఆల్ట్రోజ్ @ రూ. 6.89 లక్షలు

టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌‌‌‌‌‌‌‌బ్యాక్ ఆల్ట్రోజ్ సరికొత్త వెర్షన్‌‌‌‌‌‌‌‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 6.89 లక్షలుగా నిర్ణయించింది.  వచ్చే నెల రెండో తేదీ నుంచి బుకింగ్స్​మొదలవుతాయి.  

ఇది పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.  సరికొత్త డిజైన్, ఎల్​ఈడీ హెడ్‌‌‌‌‌‌‌‌లైట్లు, వాయిస్-ఎనేబుల్ సన్‌‌‌‌‌‌‌‌రూఫ్, వైర్‌‌‌‌‌‌‌‌లెస్ ఛార్జర్, 10.25 అంగుళాల టచ్‌‌‌‌‌‌‌‌స్క్రీన్ డిస్‌‌‌‌‌‌‌‌ప్లే (ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్‌‌‌‌‌‌‌‌తో), 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌‌‌‌‌‌‌‌బ్యాగ్‌‌‌‌‌‌‌‌లు, హిల్ హోల్డ్ అసిస్టెన్స్, ఫాగ్ ల్యాంప్స్, ఎమర్జెన్సీ ఎస్​ఓఎస్​ కాల్ ఫీచర్లు దీని సొంతం.