నెక్సాన్​ నుంచి కొత్త ఈవీ

 నెక్సాన్​ నుంచి కొత్త ఈవీ

టాటా మోటార్స్​  నెక్సాన్ కొత్త ఈవీని రూ. 14.74  లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్​ చేసింది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 465 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ మోడల్ మరొక  ఈవీని ఛార్జ్ చేయగలుగుతుంది.   గాడ్జెట్‌‌లు, ఎలక్ట్రికల్ క్యాంపింగ్ పరికరాలు, పవర్ టూల్స్ వంటి కన్జూమర్​ ఎలక్ట్రానిక్స్ పరికరాలను చార్జ్​ చేయగలుగుతుంది. పన్నెండు ఇంచుల స్క్రీన్​, 10 ఇంచుల ఇన్​స్ట్రమెంట్​ క్లస్టర్​, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్​ స్పాట్​ మానిటర్​, వైర్​లైస్​ స్మార్ట్​ఫోన్​ చార్జర్​, వాయిస్​ కమాండ్​ ఫంక్షన్​, ఎయిర్​ ప్యూరిఫయర్​, జేబీఎల్ ​ఆడియో సిస్టమ్​, సన్​రూఫ్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం.

బ్యాటరీపై 1.60 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తారు.  కంపెనీ పెట్రోల్,  డీజిల్ ఇంజన్‌‌లతో కూడిన నెక్సాన్‌‌ను రూ. 8.09 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభ ధరలతో పరిచయం చేసింది. మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి వాటితో నెక్సాన్ పోటీ పడుతోంది. తాము 2017లో నెక్సాన్‌‌ను ప్రారంభించినప్పుడు, ఈ విభాగంలో నెలకు 30 వేల యూనిట్ల విక్రయాలు జరిగేవని,  ఇప్పుడు నెలకు 90 వేల యూనిట్లకు పెరిగాయని టాటా తెలిపింది.  తాము దేశంలో ఇప్పటివరకు 5.5 లక్షల యూనిట్ల నెక్సాన్‌‌లను విక్రయించిందని వెల్లడించింది.