
న్యూఢిల్లీ: పాన్‌ను ఆధార్‌తో ఈ నెల 31 లోపు లింక్ చేసుకోవాలని, లేకపోతే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్) ఎక్కువ కట్ అవుతుందని ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం, పాన్–ఆధార్ లింక్ కాకపోతే టీడీఎస్ రెండింతలు కట్ అవుతుంది. మరోవైపు బ్యాంకులు, ఫారెక్స్ డీలర్లు, ఎన్‌బీఎఫ్‌సీలు,పోస్ట్ ఆఫీసులు వంటి రిపోర్టింగ్ ఎంటిటీలు ఈ నెల 31 లోపు స్టేట్‌మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను (ఎస్‌ఎఫ్‌టీ) ఫైల్ చేయాలని పేర్కొంది.
లేకపోతే పెనాల్టీ పడుతుందని వెల్లడించింది. డెడ్‌లైన్‌లోపు ఎస్‌ఎఫ్‌టీ ఫైల్ చేయకపోతే డీఫాల్ట్ అయిన తర్వాత రోజుకి రూ. 1,000 వరకు పెనాల్టీ పడుతుంది. కాగా, ఎస్‌ఎఫ్‌టీల ద్వారా ఎక్కువ విలువున్న ట్రాన్సాక్షన్లను ఇన్‌కమ్ ట్యాక్ డిపార్ట్‌మెంట్ ట్రాక్ చేస్తోంది.