ఆదాయం కోసం చెత్తపై కూడా పన్ను

ఆదాయం కోసం చెత్తపై కూడా పన్ను

ఆదాయం పెంచుకోవడానికి  ముంబై నిర్ణయం

ముంబై.. ఇండియా ఆర్థిక రాజధాని. దేశంలోని రిచ్చెస్ట్‌‌ మున్సిపాలిటీ (బీఎంసీ). కానీ ఇప్పుడు పైసల్లేక కిందామీదవుతోంది. ఎకానమీ స్లోగైపోయి, రియల్‌‌ ఎస్టేట్‌‌ బూమ్‌‌ పడిపోయి డబ్బులు రాక ఇబ్బంది పడుతోంది. అందుకే ఎట్లెట్ల పైసలు పెంచుకోవాలా అని ఆలోచిస్తోంది. దేనిమీద ట్యాక్స్‌‌ వేస్తే ఎక్కువొస్తాయా అని చూస్తోంది. తాజాగా చెత్తమీద  ట్యాక్స్‌‌ వేద్దామని ఫిక్సయింది. బర్త్‌‌ సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడూ ఎక్స్‌‌ట్రా లెవీ వేద్దామనుకుంటోంది. కొత్త ట్యాక్స్‌‌లు వేయడంతో పాటు గతంలో బకాయి పడ్డ వారి నుంచీ వసూలు చేసే పనిలో పడింది. ప్రాపర్టీ ట్యాక్స్‌‌, వాటర్‌‌ ట్యాక్స్‌‌ డిఫాల్టర్లకు నోటీసులిచ్చి పైసలు రాబట్టాలనుకుంటోంది. లేకపోతే ప్రాపర్టీని వేలం వేయాలని, నీటి కనెక్షన్‌‌ కట్‌‌ చేయాలని ఫిక్స్‌‌ అయింది.

వచ్చే యేడు కూడా తగ్గుడే

ముంబై కార్పొరేషన్‌‌కు గతేడాది ఆదాయం 5 శాతం తగ్గింది. ఇక వడ్డీ రేట్లు తక్కువవడం వల్ల కార్పొరేషన్‌‌ నుంచి పెట్టుబడి పెట్టిన సుమారు రూ. 78 వేల కోట్లకూ వచ్చే యేడు ఇన్‌‌కమ్‌‌ తక్కువనే వస్తుందని అంచనా వేస్తోంది.  సుమారు 11% వరకు తగ్గుతుందని భావిస్తోంది. ఎకానమీ స్లో డౌన్‌‌ వల్ల రిజర్వు బ్యాంకు నుంచి కూడా ఎలాంటి కాంపెన్సేషన్‌‌ వచ్చే అవకాశం లేదని అనుకుంటోంది. 2017 వరకు ముంబై కార్పొరేషన్‌‌కు మూడో వంతు  ఆదాయం ఆక్ట్రాయ్‌‌ పన్ను నుంచే వచ్చేది. కానీ దాన్ని జీఎస్టీలో కలిపేయడంతో కాంపెన్సేషన్‌‌ ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దానీ మీదా ఆశలను కార్పొరేషన్‌‌ వదులుకుంది. అందుకే కొత్త ట్యాక్స్‌‌లు, పాత బకాయిల వసూలు మీద పడింది.

ఈసారి 9 శాతం ఎక్కువ ఖర్చు

ఈసారి 9 శాతం ఎక్కువ బడ్జెట్‌‌ను ఖర్చు చేయాలని కార్పొరేషన్‌‌ అనుకుంటోంది. నగరంలో వరదలు రాకుండా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయాలని భావిస్తోంది. సిటీ తీరాన్ని తాకుతూ పోయే ‘క్వీన్స్‌‌ నెక్లెస్‌‌’ కోస్టల్‌‌ రోడ్‌‌కూ బాగానే ఖర్చు చేయాలనుకుంటోంది. అందుకే ఆదాయాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తోంది. దేశంలోని చాలా రాష్ట్రాల బడ్జెట్‌‌ కన్నా బీఎంసీ బడ్జెట్‌‌ ఎక్కువ. ఈసారి రూ.33 వేల కోట్లకు బడ్జెట్‌‌ను బీఎంసీ ప్రవేశపెట్టింది. పోయినేడాది బడ్జెట్‌‌ రూ.30 వేల కోట్లు.