ఐటీ రిటర్న్స్‌లో అప్‌డేట్‌కు రెండేళ్ల సమయం

ఐటీ రిటర్న్స్‌లో అప్‌డేట్‌కు రెండేళ్ల సమయం

ఐటీ రిటర్న్​ల దాఖలులో నవీకరణ చేపడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే ఐటీ రిటర్న్స్‌ దాఖలులో ఏవైనా పొరబాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకునేందుకు, కొత్తగా అప్‌డేట్ చేసేందుకు రెండేళ్ల పాటు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. 

కోఆపరేటివ్ సొసైటీలకు పన్ను తగ్గింపు

కోఆపరేటివ్ సొసైటీలకు పన్ను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కంపెనీలతో సమానంగా ఆల్టర్నేట్‌ పన్ను ఉంటుందన్నారు. ఇకపై కోఆపరేటివ్ సొసైటీపై విధించే ఆల్టర్నేటివ్ పన్ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. అలాగే కోఆపరేటివ్ సొసైటీలపై సర్‌‌చార్జీని కూడా ఏడు శాతానికి తగ్గిస్తున్నామన్నారు.

వర్చువల్ డిజిటల్ అసెట్స్ ట్రాన్స్‌ఫర్‌‌పై వచ్చే ఆదాయానికి ఇకపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని నిర్మలమ్మ తెలిపారు. వీటిని ఎవరికైనా గిఫ్ట్‌గా ఇస్తే.. ఆ తీసుకున్న వ్యక్తి పన్ను చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇక లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై వచ్చే ఆదాయ నుంచి 15 శాతం పన్ను వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈక్విటీ ట్యాక్స్ సర్‌‌చార్జ్‌ను 15 శాతానికి తగ్గించారు.