
- నేను ఎమ్మెల్యే మనిషిని.. నీ సంగతి చూస్తా
- సింగరేణి ఆఫీసర్ కు బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నేత బెదిరింపు
భద్రాద్రి కొత్తగూడెం: 'నేను ఎమ్మెల్యే మనిషిని.. నేనెక్కడికైనా పోతా.. ఎప్పుడై నా వస్తా.. నాకు చెప్పేటోడివా... నా ఇష్టం ఉన్నప్పుడు డ్యూటీకి వస్తా అంటూ బీఆర్‌ఎస్ టీపీజీకేఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి సింగరేణి కాలరీస్ ఇల్లందు జీకే ఓస్ సేఫ్టీ ఆఫీసర్ శివ ప్రసాద్‌ను బెదిరించాడు.
జీకే ఓసీలో సేఫ్టీ ఆఫీసర్ గా పనిచేస్తున్న శివప్రసాద్ ప్రస్తుతం యాక్టింగ్ మేనేజర్ గాను అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ టీబీకేఎస్ నేత, ఓసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి డ్యూటీకి వచ్చి అటెండెన్స్ వేసి బయటికి వెళ్తుండడంతో రెండు మూడు సార్లు శివప్రసాద్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి "నేను ఎమ్మెల్యే మనిషిని.. నేను ఎక్కడికి పోతే నీకేంటి.. నాకే చెప్తావా... నీ సంగతి చూస్తా అంటూ బెదిరించాడు. అనంతరం ఇరువురి మధ్య మాట పెరిగి సింగరేణి అధికారిపై చేయిచేసుకున్నాడు. దీనికి నిరసనగా సింగరేణి అధికారులు పెన్ డౌన్ చేశారు.