టీసీఐ నాలుగో క్వార్టర్​ ఆర్థిక ఫలితాలు.. లాభం రూ.115 కోట్లు

టీసీఐ నాలుగో క్వార్టర్​ ఆర్థిక ఫలితాలు.. లాభం రూ.115 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: ఇంటిగ్రేటెడ్ మల్టీమోడల్ లాజిస్టిక్స్, సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (టీసీఐ) ఈ ఏడాది మార్చి 31, 2025తో ముగిసిన నాలుగో క్వార్టర్​ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈసారి నికరలాభం 11.4శాతం పెరిగి రూ.115.1 కోట్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరం నాలుగో క్వార్టర్​లో రూ.103.3 కోట్లుగా ఉంది.

టీసీఐ రూ.1197.2 కోట్ల ఆదాయాన్ని ( కన్సాలిడేటెడ్​) నమోదు చేసింది.  గత సంవత్సరం ఇదే కాలంలో రూ.1095.4 కోట్లు వచ్చాయి. ఇబిటా 11 శాతం పెరిగి రూ.140.1 కోట్లకు చేరింది. 2025 పూర్తి ఆర్థిక సంవత్సరంలో టీసీఐ ఆదాయం రూ.4538.5 కోట్లు ఉంది. ఏడాది లెక్కన ఇది 11.5 శాతం పెరిగింది. నికరలాభం 17.4శాతం వృద్ధితో రూ.416.1 కోట్లకు చేరుకుంది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.354.5 కోట్లు ఉంది.