హోమ్​ లోన్ తీసుకునే ప్లాన్ లో ఉన్నారా.. ఇదే రైట్​ టైమ్: ఈ బ్యాంకుల్లో వడ్డీ 8 శాతమే.. ​

హోమ్​ లోన్ తీసుకునే ప్లాన్ లో ఉన్నారా..  ఇదే రైట్​ టైమ్: ఈ బ్యాంకుల్లో వడ్డీ 8 శాతమే.. ​
  • ఆర్​బీఐ నిర్ణయాలతో తగ్గిన వడ్డీ రేట్లు

న్యూఢిల్లీ: సొంతింటి కలను నిజం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే ఆర్​బీఐ  విధానాల కారణంగా హోంలోన్లు తక్కువ వడ్డీలకే వస్తున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో ఆర్​బీఐ ఇప్పటికే రెండుసార్లు రెపో రేటును తగ్గించింది. మొత్తం 50 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో రెపోరేటు 6.5శాతం నుంచి ఆరుశాతానికి దిగివచ్చింది.  దీంతో హోమ్​లోన్ వడ్డీ రేట్లు ఎనిమిది శాతం కంటే తక్కువకు పడిపోయింది.  చాలా టాప్​బ్యాంకులు ఎనిమిది శాతం వడ్డీకే  హోమ్​లోన్​ఇస్తున్నాయి.  

ఈ నెల తొమ్మిదో తేదీ నాటికి బ్యాంకులు అందిస్తున్న ఫ్లోటింగ్- రేట్ హోమ్​లోన్లపై అతి తక్కువ వడ్డీ రేట్లను ఇక్కడ చూడవచ్చు. ఈ వడ్డీ రేట్లు అర్హత గల రుణగ్రహీతలకు మాత్రమే వర్తిస్తాయి. బ్యాంకుల విధానాలు ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా మారవచ్చు. సిబిల్​స్కోర్​తక్కువగా ఉండే వారికి బ్యాంకులు ఎక్కువ వడ్డీకి లోన్లు ఇవ్వవచ్చు. హోమ్​లోన్ ఈఎంఐలో అసలు,  వడ్డీ కలిసి ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన టేబుల్​లో 20 ఏళ్ల కాలానికి రూ.30 లక్షల లోన్​కు వడ్డీ, ఈఐఎం వివరాలు ఉన్నాయి.

 హోమ్​లోన్ ఈఎంఐని ప్రభావితం చేసే అంశాలు

క్రెడిట్ స్కోర్: బ్యాంకులు మీ లోన్​ అర్హతను నిర్ణయించడానికి క్రెడిట్ స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను చూస్తాయి. సాధారణంగా 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మంచిదిగా పరిగణిస్తారు. అయితే 750 కంటే తక్కువ క్రెడిట్ స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నెగటివ్​గా భావిస్తారు. మీ క్రెడిట్ స్కోర్ సగటు కంటే తక్కువగా ఉంటే, బ్యాంకులు ఎక్కువ వడ్డీని వసూలు చేయవచ్చు.

బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ రేట్లు: ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఉంటే, బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ రేటులో ఏదైనా మార్పు మీ హోమ్​లోన్ వడ్డీ రేటుపై ప్రభావం చూపుతుంది. బ్యాంకులు తమ హోమ్​లోన్ వడ్డీ రేట్లను ఎక్స్​టెర్నల్​ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుసంధానించాలని ఆర్​బీఐ 2019 అక్టోబరులో కోరింది. బ్యాంకులు క్రింది వాటిలో దేనినైనా ఎక్స్​టర్నల్​ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉపయోగించుకోవచ్చు.
    
ఫైనాన్షియల్ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్​బీఐఎల్) ప్రచురించిన కేంద్రం ప్రభుత్వ మూడు నెలల ట్రెజరీ బిల్లు రాబడి.
    
ఎఫ్​బీఐఎల్ ప్రచురించిన కేంద్ర ప్రభుత్వ  ఆరు నెలల ట్రెజరీ బిల్లు రాబడి 
    
ఎఫ్​బీఐఎల్ ప్రచురించిన ఏదైనా ఇతర బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ మార్కెట్ వడ్డీ రేటు.

రెపో రేటులో తగ్గింపు మీ హోమ్​లోన్ ఈఎంఐని కూడా తగ్గిస్తుంది. బ్యాంకులు సెప్టెంబర్ 30, 2019 నుంచి ఇచ్చిన లోన్లు ఎంసీఎల్​ఆర్ ప్రకారం ఉంటాయి. ప్రస్తుత రుణగ్రహీతలు  కూడా ఎక్స్​టర్నల్​ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్కింగ్ లోన్​ విధానానికి మారడానికి అవకాశం ఉంది.

వడ్డీ రేటు రకం: 

ఫిక్స్​డ్​ లేదా ఫ్లోటింగ్​ రేటు:ఫిక్స్​డ్​-రేటు,  ఫ్లోటింగ్​-రేటు హోమ్​లోన్లకు వేర్వేరు రకాల వడ్డీలు ఉంటాయి. ఫిక్స్​డ్​-రేటు లోన్లపై వడ్డీ సాధారణంగా ఫ్లోటింగ్​- రేటు లోన్లు అందించే రేట్ల కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫ్లోటింగ్​-రేటు లోన్లు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా కాలానుగుణంగా మారే అవకాశం ఉన్నందున ఊహించడం సాధ్యం కాదు.

లోన్​ మొత్తం: హోమ్​లోన్ల విషయానికి వస్తే, తీసుకున్న లోన్​ మొత్తం బ్యాంకు అందించే వడ్డీ రేటును ప్రభావితం చేస్తుంది. సాధారణంగా, పెద్ద మొత్తంలో లోన్లపై అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. చిన్న లోన్లపై తక్కువ రేట్లు ఉండవచ్చు.

ఆస్తి  ఉండే ప్రాంతం:రీసేల్​వాల్యూ ఎక్కువ ఉండే ప్రాంతంలో మీరు కొనాలని ప్లాన్ చేస్తున్న ఆస్తి ఉండే బ్యాంకులు తక్కువ వడ్డీ రేటును వసూలు చేయవచ్చు. ఇది తక్కువగా ఉండే ప్రాంతంలో ఆస్తులకు వడ్డీ ఎక్కువగా ఉండవచ్చు.

బ్యాంక్                 అత్యల్ప రేటు    (రూ.30 లక్షల లోన్​ ఈఎంఐ) 
 

కెనరా బ్యాంక్                    7.80                            24,720
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర    7.85                            24,810
సెంట్రల్ బ్యాంక్               7.85                           24,810
యూనియన్ బ్యాంక్          7.85                           24,810
ఇండియన్ బ్యాంక్            7.90                           24,900
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్    7.90                   24,900
బ్యాంక్ ఆఫ్ బరోడా             8.00                         24,900
బ్యాంక్ ఆఫ్ ఇండియా       8.00                          25,080
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా    8.00                    25,080
పంజాబ్ నేషనల్ బ్యాంక్    8.00                        25,080