ఏఐతో కాల్ సెంటర్ల అవసరం తగ్గుతుంది : కృతివాసన్‌‌

ఏఐతో కాల్ సెంటర్ల అవసరం తగ్గుతుంది : కృతివాసన్‌‌

న్యూఢిల్లీ: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కాల్ సెంటర్ల అవసరం బాగా తగ్గిపోతుందని టీసీఎస్‌‌ సీఈఓ కే కృతివాసన్‌‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఏఐ విస్తరించే స్పీడ్  చూస్తుంటే ఇంకో  ఏడాదిలో మార్పు కనిపిస్తుందని  అన్నారు. ఇండియా, ఫిలిప్పిన్స్ వంటి దేశాల్లో  కాల్ సెంటర్లు ఎక్కువ మందికి జాబ్స్ ఇస్తున్నాయి. ఏఐతో మొత్తం ఇండస్ట్రీ రూపురేఖలు మారిపోతాయని ఆయన అంచనా వేశారు. 

ఫ్యూచర్‌‌‌‌లో కాల్ సెంటర్లకు ఇన్‌‌కమింగ్ కాల్స్ తగ్గిపోతాయని, ఏఐ సిస్టమ్‌‌ కస్టమర్ల సమస్యలను ముందుగానే గుర్తించి, అంచనా వేసి పరిష్కరిస్తాయని కృతివాసన్‌‌ అన్నారు.  సాధారణంగా కాల్‌‌ సెంటర్ ఏజెంట్లు చేసే పని  ఏఐతో కూడిన చాట్‌‌బాట్‌‌లే చేస్తాయని, కస్టమర్ల ట్రాన్సాక్షన్ హిస్టరీని విశ్లేషించి, పనులు పూర్తి చేస్తాయని పేర్కొన్నారు. ఇదంతా జరగడానికి టైమ్ పట్టొచ్చన్న ఆయన,  ఏడాదిలోపు మార్పు కనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.    టెకీల అవసరం మరింత పెరుగుతుందని, డిమాండ్‌‌కు తగ్గట్టు ట్రెయినింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.