4జీ కోసం.. TCSకు రూ.15 వేల కోట్ల BSNL ప్రాజెక్ట్

4జీ కోసం.. TCSకు రూ.15 వేల కోట్ల BSNL ప్రాజెక్ట్

టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) భారతీయ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నేతృత్వంలోని కన్సార్టియంకు రూ. 15వేల కోట్ల విలువైన ముందస్తు కొనుగోలు ఆర్డర్‌లను (APOs) జారీ చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ నేతృత్వంలోని కన్సార్టియం 100 శాతం ప్రభుత్వపరమైన BSNL నుంచి రూ. 15వేల కోట్ల విలువైన అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డర్‌ను అందుకుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది దేశ వ్యాప్తంగా 4జీని అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. దేశంలోని ప్రైవేటు టెలికాం కంపెనీలు 2016లోనే పెద్ద ఎత్తున 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అంతే కాకుండా రిలయన్స్ జియో, ఎయిర్ టెల్.. 2022లో దేశమంతటా 5జీ సేవలను కూడా అందిస్తున్నాయి.

ప్రభుత్వ టెలికాం ఆపరేటర్స్ కంటే ప్రయివేటు కంపెనీలు ముందంజలో ఉన్నాయన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. అంతకుముందు  BSNL ద్వారా 4G మౌలిక సదుపాయాలను 5Gకి పెంచుతామని ఐటీ అండ్ టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. BSNL ద్వారా అమలు చేయబడిన 4G పరికరాలు 5Gకి మెరుగుపరచబడతాయని, దీనికి సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అవసరం అని మంత్రి తెలిపారు.

https://twitter.com/ANI/status/1660499171609309184