TCS News: అదరగొట్టిన టీసీఎస్.. అంచనాలకు మించి క్యూ1 లాభాలు, డివిడెండ్ ప్రకటన..

TCS News: అదరగొట్టిన టీసీఎస్.. అంచనాలకు మించి క్యూ1 లాభాలు, డివిడెండ్ ప్రకటన..

TCS Q1 Results: భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నేడు జూన్ తో ముగిసిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రటించింది. ఈ కాలంలో కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 6 శాతం పెరిగి రూ.12వేల 760 కోట్లుగా నమోదైంది. వాస్తవానికి ఇది మార్కెట్ అంచనాలను మించిన పనితీరుతో మెరుగైన గణాంకాలను నివేదించింది. 

ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో కంపెనీ వ్యాపార ఆదాయం రూ.64వేల 437 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. ఇదే క్రమంలో కంపెనీ తన షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ.11 చొప్పున డివిడెండ్ మధ్యంతర చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రికార్డ్ తేదీని జూలై 16గా ప్రకటించింది. 

జూన్ 30తో ముగిసిన కాలంలో కంపెనీ తన మెుత్తం కాంట్రాక్డ్ బుక్ 9.4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ప్రటించింది. కంపెనీ ప్రధానంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్, ఎనర్జీ, టెక్నాలజీ అండ్ సర్వీసెస్ రంగాల్లో మంచి వృద్ధిని చూసినట్లు వెల్లడైంది. ఇక హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, కన్జూమర్ బిజినెస్ కొంత నెమ్మదించినట్లు వెల్లడైంది. 

ALSO READ  : లక్ష 12వేల డాలర్లకు బిట్‌కాయిన్ ధర.. మూడు నెలల్లో 40 శాతం అప్.. ఇంకా పెరుగుతుందా?

ఇక ఉద్యోగుల హెడ్ కౌంట్ విషయానికి వస్తే తొలి త్రైమాసికంలో నికర ప్రాతిపధికన ఈ సంఖ్య 5వేల 090 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం టీసీఎస్ మెుత్తం ఉద్యోగుల సంఖ్య 6లక్షల 13వేల 069గా ఉన్నట్లు కంపెనీ నివేదించింది. ఇప్పుడు 114,000 మంది ఉన్నత స్థాయి AI నైపుణ్యాలను కలిగి ఉందని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ చెప్పారు.