బ్రాండ్​ వాల్యూలో మన ఐటీ కంపెనీలు టాప్

బ్రాండ్​ వాల్యూలో మన ఐటీ కంపెనీలు టాప్

న్యూఢిల్లీ: టాప్​ 25 ఐటీ సర్వీసెస్​ బ్రాండ్స్​లో మన ఐటీ కంపెనీలు టీసీఎస్​, ఇన్ఫోసిస్​లు రెండు, మూడో ప్లేస్​లను దక్కించుకున్నాయి. బ్రాండ్​ ఫైనాన్స్​ ఏటా ప్రకటించే ఈ జాబితాలో యాక్సెంచర్​ వరసగా నాలుగో ఏడాది మొదటి ప్లేస్​లో నిలిచింది. ఐబీఎంను రెండు ప్లేస్​లు వెనక్కి నెట్టాయి టీసీఎస్​, ఇన్ఫోసిస్​ కంపెనీలు. దీంతో ఐబీఎం నాలుగో ప్లేస్​కు పడిపోయింది. మరో నాలుగు భారత కంపెనీలకూ ఈ జాబితాలో చోటు దొరికింది. విప్రో (7 ​), హెచ్​సీఎల్​ (8), టెక్​ మహీంద్రా (15), ఎల్​టీఐ (22) ప్లేస్​లను పొందినట్లు బ్రాండ్​ ఫైనాన్స్​ రిపోర్టు వెల్లడించింది. మొదటి ప్లేస్​లోని యాక్సెంచర్​ బ్రాండ్​ వాల్యూ ఏకంగా 36.2 బిలియన్​ డాలర్లని తెలిపింది. డిజిటల్​ స్కిల్స్​ తెలిసిన ఉద్యోగులు ఎక్కువ మంది ఉండటంతో మన కంపెనీలు ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​, డేటా ఎనలిటిక్స్​, ఇంటర్​నెట్​ ఆఫ్​ థింగ్స్​ (ఐఓటీ) రంగాలలో లీడ్​ చేస్తాయని బ్రాండ్​ ఫైనాన్స్​ పేర్కొంది. 2021లోనే టీసీఎస్​ 25 బిలియన్​ డాలర్ల రెవెన్యూ మార్కును అందుకుంది. 25 శాతం ఆపరేటింగ్​ మార్జిన్​ను ఈ కంపెనీ సంపాదించగలుగుతోంది.