ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ఫలితం

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ఫలితం

ఏపీలో  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ఫలితం వెలువడింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు. 23 ఓట్లతో అనురాధ గెలుపొందారు. 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి 23 ఓట్లతో అనుహ్యాంగా  ఆమె  గెలుపొందారు. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో టీడీపీ ఒక ఎమ్మెల్సీ సీటు గెలుచుకుంది. 

పంచుమర్తి అనురాధ గెలుపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షాక్ అయ్యింది. 21 మంది ఎటూ టీడీపీకి ఉన్నారని ముందుగానే డిసైడ్ అయినా.. మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం సంచలనంగా మారింది. టీడీపీని ఓడించాలని గట్టిగా చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. మొన్నటికి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓ స్థానంలో ఓడిపోయింది. ఇంతకీ వైసీపీ నుంచి టీడీపికి ఓటు వేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరూ అనేది తీవ్ర చర్చకు దారి తీసింది.